గురువారం హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ పట్టభద్రుల తెరాస ఎమ్మెల్సీ సురభి వాణిదేవి కారు ప్రమాదానికి గురైంది. గురువారం ఉదయం ఆమె శాసన మండలికి వస్తుండగా అసెంబ్లీ ప్రాంగణంలోని రైల్వే కౌంటర్ వద్ద కారు అదుపుతప్పి గేటును ఢీకొట్టడంతో కారు ముందు భాగం ధ్వంసమైంది. ప్రమాదం జరిగిన సమయంలో వాణిదేవి గన్మెన్ కారు నడిపినట్టు సమాచారం.