ఓర్వకల్లులో నూతనంగా ఏర్పాటు చేసిన కర్నూలు విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయంగా నామకరణం చేసి ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బుగ్గన రాజేంద్ర నాథ్‌రెడ్డి, గౌతంరెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ ‘‘ కర్నూలు జిల్లా చరిత్రలో ఇది సుదినం. ఈనెల 28 నుంచి ఓర్వకల్లులో విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి. ప్రారంభంలో బెంగళూరు, చెన్నై, విశాఖకు సర్వీసులు. ఒకేసారి నాలుగు విమానాలు పార్క్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. ఓర్వకల్లు విమానాశ్రయం రాష్ట్రంలో ఆరోది. న్యాయ రాజధానిని మిగతా రాష్ట్రాలతో ఓర్వకల్లు కలుపుతుంది’’ అని సీఎం వివరించారు.