జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ వైష్ణోదేవి ఆలయానికి బంగారంతోపాటు 4,700 కిలోల వెండి, రూ.2000 కోట్ల నగదు ఆలయానికి అందాయని, 1,800 కేజీల బంగారం విరాళంగా వచ్చిందని సామాజిక కార్యకర్త హేమంత్‌ గునియా స.హ చట్టం కింద చేసిన దరఖాస్తు సమాచారహక్కు చట్టం ద్వారా తెలిసింది. ‘వానా కాలం రానున్న నేపథ్యంలో ఆలయ బోర్డు ఈ డబ్బును యాత్రికులకు వసతులు కల్పించేందుకు, ప్రభుత్వ పాఠశాలల నిర్మాణానికి కూడా ఉపయోగించవచ్చు’ అని హేమంత్‌ గునియా తెలిపారు. ఆలయానికి భక్తుల తాకిడి గతేడాది భారీగా తగ్గిందని ఆర్టీఐ దరఖాస్తు ద్వారా తెలిసింది. కరోనా కారణంగా 2020లో కేవలం 17 లక్షల మందే ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శించారని తెలిసింది.