జాతీయం (National) వార్తలు (News)

మైక్రోసాఫ్ట్‌పై రివెంజ్ తీర్చుకోవాలనుకున్న టెకీకి షాక్

భారత సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్‌ మాజీ ఉద్యోగి దీపాంశు ఖేర్‌ తనను ఉద్యోగంనుంచి తొలగించారన్న ఆక్రోశంతో ప్రతీకారం తీర్చు కోవాలనుకుని సుమారు 1200 యూజర్‌ అకౌంట్లను డిలీట్‌ చేసి పారేసి సైబర్‌ నేరానికి పాల్పడ్డారు. దీనిపై విచారించిన అమెరికా కోర్టు దీపాంశుకు రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ, మరో మూడేళ్లు అతనిపై నిరంతర పర్యవేక్షణతోపాటు, 5,67,084 డాలర్ల (సుమారు నాలుగుకోట్ల రూపాయలు) జరిమానా విధిస్తూ తీర్పుచెప్పింది.

ఉద్యోగంలో ఉద్వాసనకు గురైన తర్వాత దీపాంశు ఆగ్రహంతో రగిలిపోయి కక్షపూరితగా కంపెనీ సర్వర్‌ను హ్యాక్‌ చేసి మరీ 1500 యూజర్‌ అకౌంట్లలో 1200 ఖాతాలను తొలగించి ఆ తర్వాత కామ్‌గా ఢిల్లీకి వచ్చేశారు. ఈ చర్య మైక్రోసాఫ్ట్‌ కంపెనీనీ తీవ్రంగా ప్రభావితం చేసింది. ఈ అకౌంట్లకు సంబంధించిన ఈమెయిల్స్‌, కాంటాక్టులు, కీలక జాబితాలు, సమావేశాల తేదీలు, డాక్యుమెంట్లు, డైరీలు, వీడియో, ఆడియో కాన్ఫరెన్సుల వివరాలన్నీ గల్లంతు కావడంతో కంపెనీ బాగా నష్టపోయి కంపెనీని రెండు రోజుల పాటు పూర్తిగా మూసేయాల్సి వచ్చింది. దీనిపై విచారణ జరుగుతోందని గమనించని దీపాంశు గత జనవరి 11న మళ్లీ ఢిల్లీ నుండి అమెరికాకు వెళ్లారు. ఈ సమయం కోసమే ఎదురు చూస్తున్నపోలీసులు అతనికి విమానాశ్రయంలోనే చెక్‌పెట్టారు. అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఉద్దేశపూరకంగా విధ్వంసక నేరం చేసి ఖేర్‌ ఎంతో తెలివిగా తప్పించు కోవాలను కున్నాడని, కంపెనీ మీద ప్రతీకారంతో, పథకం ప్రకారమే సైబర్‌ నేరానికి పాల్పడ్డాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని అమెరికా డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ న్యాయమూర్తి మేరిలిన్‌ హఫ్‌ వ్యాఖ్యానించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.