టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

తెలంగాణాలో 95% కొలువులు స్థానికులకే!!

జోనల్ వ్యవస్థ అమలులో కొత్త జోనల్ వ్యవస్థ నిబంధనలు పాటించాలంటూ సాధారణ పరిపాలనా శాఖ(జీఏడీ) అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశిస్తూ జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ప్రకారం ఇక మీదట స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కనున్నాయి. జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల్లో స్థానికుల 95 శాతం, ఇతరులకు 5 శాతం చొప్పున ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్రంలో రెండు మల్టీ జోన్లు, ఏడు జోన్లు, 33 జిల్లాలతో కూడిన కొత్త జోనల్‌ వ్యవస్థను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

‘తెలంగాణ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అమెండ్‌మెంట్‌ ఆర్డర్‌-2021’ పేరుతో రూపొందించిన ఈ జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఏప్రిల్‌ 16న ఉత్తర్వులు జారీ చేసింది. జోనల్ వ్యవస్థకు లైన్ క్లియర్ అవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీపై దృష్టి పెట్టింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •