క్రైమ్ (Crime) వార్తలు (News)

ఒక ప్రభుత్వ ఉద్యోగి రూ.10 కోట్ల అక్రమ సంపాదన .. అది కూడా పెయిడ్‌ లీవ్స్‌ అప్లై చేసి..??

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ జిల్లాలో ఒక ప్రభుత్వ ఉద్యోగి నకిలీ పెయిడ్‌ లీవ్స్‌తో రూ.10 కోట్లు అక్రమంగా సంపాదించాడు. రాజేష్ రామి అనే వ్యక్తి జిల్లాలోని ప్రాథమిక విద్యాశాఖలో డిప్యూటీ అకౌంటెంట్‌గా పనిచేస్తున్నాడు. దీనిని ఆసరాగా తీసుకున్న రాజేష్ అహ్మదాబాద్‌ జిల్లాలోని ఎనిమిది తాలూకాల్లోని ప్రభుత్వ ప్రాథమిక స్కూళ్లలో పని చేసే ఉపాధ్యాయుల పేరుతో సుమారు 5000 నకిలీ పెయిడ్‌ లీవ్స్‌ను అప్లై చేసి ఆ పెయిడ్‌ లీవ్స్‌ను రూ.9.99 కోట్ల మేర నగదుగా మార్చుకుని తన కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు మళ్లించాడు.

2016-17, 2017-18 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మూడు తాలూకాలు సమర్పించిన డాక్యుమెంట్లను అధికారులు ఆడిట్‌ చేయగా విషయం బైటకి పొక్కడంతో సంబంధిత అధికారులు ఈ నెల 15న రాజేష్ రామి చీటింగ్‌పై కరంజ్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసారు. ఈ స్కామ్‌లో మరికొందరి ప్రమేయం ఉండి ఉంటుందని అనుమానిస్తుండగా నిందితుడు రాజేష్‌ రామి పరారు అయ్యాడు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    2
    Shares
  • 2
  •  
  •  
  •  
  •