అంతర్జాతీయం (International) రాజకీయం (Politics) వార్తలు (News)

తాలిబన్లను అడ్డుకునే దిశగా అఫ్గానిస్తాన్!!

తాలిబన్ల చేతిలోకి నగరాలు వెళ్లకుండా రాజధాని కాబూల్‌తోపాటు మరో రెండు ప్రధాన ప్రావిన్స్‌లలో రాత్రి 10 నుంచి ఉదయం నాలుగు గంటల మధ్య ఎవరూ బయట తిరగకూడదని అఫ్గానిస్తాన్ ప్రభుత్వం శనివారం ప్రకటించింది. అంతర్జాతీయ బలగాలు ఇక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోతుండటంతో, గత రెండు నెలల్లో ఇక్కడి ప్రభుత్వం, తాలిబన్ల మధ్య ఘర్షణ వాతావరణం పెరిగింది.

అమెరికా బలగాలను ఇక్కడి నుంచి ఉప సంహరించుకోవడంతో సరిహద్దుల్లోని ప్రధాన భూభాగాలు, గ్రామీణ ప్రాంతాలను తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. చాలా నగరాలకు వీరు సమీపంలో ఉన్నారు. ప్రస్తుతం పట్టణాలు, నగరాలను అనుసంధానించే ప్రధాన రాహదారులను తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటున్నారు. హింసను అడ్డుకోవడంతోపాటు తాలిబన్లకు కళ్లెం వేసేందుకు రాత్రి కర్ఫ్యూను అమలులోకి తీసుకొస్తున్నాం. 31 ప్రావిన్సుల్లో ఇది అమలులో ఉంటుంది’’అని దేశ హోం శాఖ తెలిపింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •