క్రైమ్ (Crime) వార్తలు (News)

డీజీపీ ప్రొటోకాల్‌.. వాహనాలు నిలిపిన ట్రాఫిక్‌ పోలీసులు.. అంబులెన్స్‌లు!!

హైదరాబాద్‌ లోని మాసబ్‌ట్యాంక్‌ లో డీజీపీ ప్రొటోకాల్‌ కోసం శనివారం సాయంత్రం పోలీసులు వాహనాలను ఆపేయడంతో అత్యవసర రోగులున్న రెండు అంబులెన్స్‌లు ట్రాఫిక్‌లో చిక్కుకున్నాయి. దీంతో అంబులెన్స్‌లో ఉన్న వైద్య సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్‌ను క్లియర్‌ చేసుకుంటూ ముందుకు సాగి ఎట్టకేలకు ఆస్పత్రి చేరుకున్నారు.

ఈఘటనపై తీవ్ర విమర్శలు రావడంతో హోం మంత్రి మహమూద్‌ అలీ స్పందిస్తూ ట్రాఫిక్‌ పోలీసుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ కూడా వివరణ ఇస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని తెలిపారు. అంబులెన్స్‌ ఘటనపై హోం మంత్రి ఆరా తీశారు. ఇప్పటికి ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగగా కొన్నిసార్లు అంబులెన్స్‌లో ఉన్నవారు మరణించిన సంఘటనలు కూడా లెక్కకు మించి జరిగాయి. ఇలాంటి ఏదయినా సంఘటన జరిగిన వెంటనే కొన్ని రోజులు ఆ సంఘటన గురించి మాట్లాడుకోవడం తరువాత మర్చిపోవడం పోలీసుల తో పాటు సామాన్య ప్రజలకు కూడా అలవాటుగా మారిపోయింది. కానీ అంబులెన్సు లో ప్రాణాలు పోగొట్టుకున్న రోగి బంధువులకు మాత్రం అదొక పీడకలగా మిగిలిపోతుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •