క్రైమ్ (Crime) వార్తలు (News)

ఉద్యోగాల పేరిట నకిలీ అపాయింట్‌మెంట్‌ ??

తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి 74 మంది వద్ద రూ.50 లక్షలు వసూలు చేసి మోసం చేసినందుకు తిరువళ్లూరు పోలీసులు అరెస్టు చేసి నిందితుడి నుంచి నకిలీ రబ్బర్‌స్టాంపులు, పలు కీలక డాక్యుమెంట్‌లను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై మేడవాక్కం ప్రాంతానికి చెందిన రంగన్‌ కుమారుడు బాలాజీ (36) హోమ్‌ హెల్త్‌కేర్‌ వెబ్‌సైట్‌ నిర్వహిస్తున్న నేపథ్యంలో తిరువళ్లూరు జిల్లా అమ్మయార్‌ కుప్పానికి చెందిన జయకాంతన్‌ కుమారుడు వెంకటాచలం సంప్రదించి తనకు ఉద్యోగం కావాలని కోరాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి రూ.55 వేలు తీసుకుని నకలీ అపాయింట్‌మెంట్‌ అర్డర్‌ను ఇవ్వడంతో అవి నకిలీవని గుర్తించి గురువారం తిరువళ్లూరు క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలాజీని పోలీసులు అరెస్ట్‌ చేశారు. విచారణలో బాలాజీ ఇప్పటి వరకు 18 మందికి రైల్వే ఉద్యోగం, 54 మందికి ఈఎస్‌ఐ వైద్యశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి రూ.50 లక్షలు వసూలు చేసినట్టు గుర్తించారు. శుక్రవారం కోర్టులో హజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్టు సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •