జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

ఇన్‌ఫార్మర్‌గా పనిచేస్తే.. కోట్లు సంపాదించే అవకాశం!!

స్మగ్లింగ్ గూడ్స్‌పై సమాచారం ఇస్తే ప్రభుత్వం భారీ స్థాయిలో బహుమతి ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. టాక్స్ పరిధిలోకి వచ్చే ఏ వస్తువు అక్రమ రవాణా గురించి వివరాలు తెలిపినా దాని విలువలో 20 శాతం మొత్తాన్ని ప్రభుత్వం ఆ ఇన్‌ఫార్మర్‌కు ఇస్తుందని అంటే ఎవరైనా కోటి రూపాయల విలువైన బంగారాన్నో, మరేదైనా వస్తువునో అక్రమంగా తీసుకొస్తున్నట్టు సమాచారం ఇచ్చినట్టయితే రూ. 20 లక్షలు వారికి ఎలాంటి పన్ను లేకుండా సంపాదించవచ్చని ఐఆర్ఎస్ అధికారి కిరణ్ కుమార్ వివరించారు.

దేశంలో బంగారం అక్రమ రవాణా కోసం స్మగ్లర్లు క్యాడ్‌బరీ అనే కోడ్‌ను ఉపయోగిస్తారని, బంగారం బిస్కెట్లు సరిగ్గా క్యాడ్‌బరీ చాక్లెట్‌లాగా ఉండటంతో ఆలా అంటారని ఇన్‌ఫార్మర్లు విమానం టికెట్ నెంబర్, ప్రయాణికుడి పేరు చెప్తే వారిని తాము ట్రాక్ చేస్తామని వివరించారు. ప్రభుత్వం 20 శాతం మొత్తాన్ని బహుమతిగా ఇస్తుండటంతో.. చాలా మంది ఇన్‌ఫార్మర్ పనిని కూడా ఓ ప్రొఫెషన్‌గా ఎన్నుకున్నవారని ఐఆర్ఎస్ అధికారి తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •