వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

తొలిసారిగా కోనసీమ కుర్రాడు ఒలింపిక్స్‌ లో!!

ప్రతి క్రీడాకారుడు కలలుకనే ఒలింపిక్స్‌ క్రీడల్లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహించే అవకాశం అమలాపురానికి చెందిన రంకిరెడ్డి సాయిరాజ్‌ సాత్విక్ కు కలిగింది. ఒలిపింక్‌ క్రీడావేదికపై సాత్విక్‌ ప్రతిభాపాటవాల ప్రదర్శించాలనే కల నేడు తీరింది. టోక్యోలో శనివారం బ్యాడ్మింటన్‌ విభాగంలో డబుల్స్‌లో జరగనున్న తొలి లీగ్‌ మ్యాచ్‌ లో ఆడడం ద్వారా సాత్విక్‌ తన కల సాకారం చేసుకున్నారు. సాత్విక్, చిరాగ్‌ శెట్టిల జంటపై క్రీడాభిమానుల్లో అంచనాలు నెలకొన్నాయి. సాత్విక్‌ తన గురువు పుల్లెల గోపీచంద్‌ ఆకాడమీలో సాధన చేసారు. బ్యాడ్మింటన్, ఒలింపిక్స్‌ అసోసియేషన్ల ప్రతినిధులు, వివిధ క్రీడా సంఘాలు, పలు స్వచ్ఛంద సంస్థలతోపాటు ఇక్కడి క్రీడాభిమానులు బంగారు పతకం సాధించాలని కోరుకున్నారు.

సాత్విక్ ట్రాక్‌ రికార్డు:
2018 ఆస్ట్రేలియా కామన్‌వెల్త్‌ పోటీల్లో మిక్స్‌డ్‌ డబుల్స్‌ టీమ్‌ విభాగంలో అశ్వనీ పొన్నప్పతో కలిసి గోల్డ్‌ మెడల్‌ సాధించారు. డబుల్స్‌ విభాగంలో చిరాగ్‌ శెట్టితో కలిసి సిల్వర్‌ మెడల్‌ సాధించారు. 2018లో హైదరాబాద్‌ ఓపెన్, 2019లో థాయిలాండ్‌ ఓపెన్‌ డబుల్స్‌ విభాగంలో స్వర్ణపతకాలు సాధించారు. 2018 సయ్యద్‌ మోడీ అంతర్జాతీయ టోర్నీ, 2019 ఫ్రెంచ్‌ డబుల్స్‌లో చిరాగ్‌ శెట్టితో 2016లో మౌరిటీస్‌ ఇంటర్‌ నేషనల్, ఇండియన్‌ ఇంటర్‌నేషనల్‌ సిరీస్, టాటా ఓపెన్‌ ఇండియా ఇంటర్నేషనల్, బంగ్లాదేశ్‌ ఇంటర్నేషనల్, 2017లో వియత్నామ్‌ ఇంటర్నేషనల్, 2019 బ్రేజిల్‌ ఇంటర్నేషనల్‌ టోర్నీలలో విజయం సాధించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •