క్రైమ్ (Crime) వార్తలు (News)

మహారాష్ట్ర భారీ వర్షాలతో 129 మంది మృతి!!

మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో 129 మంది ప్రాణాలు కోల్పోయారు. గడచిన 24 గంటల్లో రాయగఢ్, రత్నగిరి, సతారా ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఘటనల్లో పలువురు గల్లంతవ్వగా వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్‌లు కృషి చేస్తున్నాయి. గత రెండురోజుల్లో పూణే ప్రాంతానికి చెందిన 84,425 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా మహారాష్ట్రలోని సముద్ర తీర ప్రాంతంలోగల కొంకణ్, రాయగఢ్, పశ్చిమ మహారాష్ట్రలో గడచిన మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మహాబలేశ్వరంలో 1500 మిల్లీలీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదయ్యింది. మరోపక్క కొండచరియలు విరిగిపడడంతో కొంతమంది గాయాలపాలవుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •