టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ !!

ఏపీ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ లో 61 స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలతో పాటు మేనేజర్‌ (స్కేల్‌-1) ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇప్పటికే ఈ ఉదోగ ఖాళీల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కాగా అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

https://www.apcob.org/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం 61 ఉద్యోగ ఖాళీలలో మేనేజర్‌ (స్కేల్‌-1) ఉద్యోగ ఖాళీలు 26 ఉండగా స్టాఫ్ అసిస్టెంట్ల ఉద్యోగ ఖాళీలు 35 ఉన్నాయి. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మేన్ అభ్యర్థులకు 500 రూపాయలు, మిగిలిన అభ్యర్థులకు 700 రూపాయలు దరఖాస్తు ఫీజుగా ఉంటుంది.

ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లకు 2021 సంవత్సరం సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్ష నిర్వహిస్తారు. ఆన్ లైన్ టెస్ట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. 2021 సంవత్సరం జూన్ 1వ తేదీ నాటికి 20 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్టాఫ్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలకు 2021 సంవత్సరం జూన్ 1 నాటికి 20 నుంచి 28 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. 40 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై తెలుగు, ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే వెబ్ సైట్ లోకి లాగిన్ అయ్యి సందేహ నివృత్తి చేసుకోవచ్చు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •