టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

టిఎస్ ఎంసెట్ హాల్ టికెట్స్.. వెబ్‌సైట్‌లో !!

తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్ల జారీ ప్రక్రియ ప్రారంభం కాగా అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకొనేందుకు నేటి నుంచి ఈనెల 31 వరకు విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవ దానికి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొ. గోవర్దన్ తెలిపారు. బిట్‌శాట్, ఎంసెట్ ఒకే రోజు ఉన్న విద్యార్థులు సమాచారం ఇస్తే మరో రోజుకు మారుస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇవాళ్టి వరకు ఇంజినీరింగ్‌ కోర్సులకు 1.63 లక్షలు, వ్యవసాయ, ఫార్మా కోర్సులకు 85,828 మంది విద్యార్థులతో కలిపి మొత్తంగా 2.49 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు. ఎంసెట్‌కు రూ.500 ఆలస్య రుసుముతో ఈనెల 29 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఆగస్టు 4 నుంచి 10 వరకు ఎంసెట్ పరీక్షలు జరగనున్న సంగతి పాఠకులకు విదితమే!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •