క్రైమ్ (Crime) వార్తలు (News)

‘స్టోన్ మ్యాన్’ దాడిలో ఒకరు మృతి!!

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో మళ్లీ స్టోన్ మ్యాన్ విజృంభిస్తున్నాడు. నగరంలోని పలు ప్రాంతాల్లోని రోడ్లపై వెళుతున్నవారు స్టోన్ మ్యాన్ దాడిలో గాయాలపాలవుతున్నారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందారు. ఇంతకీ స్టోన్ మ్యాన్ ఎవరు? ఎక్కడుంటాడు? అనే వివరాలు ఈనాటికీ పోలీసులు తెలుసుకోలేకపోగా నగరంలో ఇటువంటి దాడులు తరచూ జరుగుతుండటంతో స్థానికులు భయాందోళనలకు లోనవుతున్నారు.

తాజాగా ఉత్తర కోల్‌కతాలోని బీకే పాల్ ఎవెన్యూలో 26 ఏళ్ల ఓం ప్రకాష్ రోడ్డు పక్కన ఒక హోటల్ నడుపుతున్నాడు. రాత్రి ఫుట్‌పాత్‌పై పడుకోగా అతనిపై స్టోన్ మ్యాన్ దాడిచేశాడు. రాళ్లతో ఓం ప్రకాష్ తలపై కొట్టడంతో అతను తీవ్రంగా గాయపడగా మర్నాటి ఉదయం ఓం ప్రకాష్ పరిస్థితిని చూసిన అతని కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని కోల్‌కతా మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తీసుకువెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ ఓం ప్రకాష్ కన్నుమూశాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఓం ప్రకాష్ కన్నుమూశాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 1989లోనూ కోల్‌కతాలో స్టోన్ మ్యాన్ దాడులు చోటుచేసుకున్నాయి. అప్పట్లో ఇటువంటి సంఘటనల్లో 13 మంది మృతి చెందినట్టుగా సమాచారం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •