వార్తలు (News)

గోదావరి లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తత అవసరం??

గోదావరికి ప్రస్తుత ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 8,60,828 క్యూసెక్కులుగా ఉండి వరద ఉధృతి అంతకంతకు పెరుగుతూనే ఉండడంతో విపత్తుల నిర్వహణ శాఖ వరద ముంపు ప్రభావిత మండలాల అధికారులను అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయక చర్యలకోసం రెండు ఎన్డీఆర్ఎఫ్, ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందాలు అక్కడకి రాగా తూర్పు గోదావరి జిల్లా చింతూరు లో రెండు బృందాలు, వి.ఆర్ పురంలో ఒక బృందం ఉంది. ఇక సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని, గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, బోట్లు, మోటర్ బోట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దని, వరద నీటిలో ఈతకు వెళ్ళడం,చేపలు పట్టడం, స్నానాలకు వెళ్ళడం లాంటివి చేయరాదు అని విపత్తుల శాఖ కమిషనర్ కె.కన్నబాబు ప్రజలను హెచ్చరించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •