వార్తలు (News)

అమితాబ్ కారు.. అధికారుల స్వాధీనం??

ప్రపంచంలో అత్యంత విలాసవంతమైన కార్లలో రోల్స్ రాయిస్ ముందువరుసలో ఉంటుంది.ఎవరికీ పడితే వారికి రోల్స్ రాయిస్ కార్లను విక్రయించరు.. పారిమితంగా మాత్రమే విక్రయిస్తుంటారు. ఈ నేపథ్యంలో తాజాగా, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ పేరిట ఉన్న రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును బెంగళూరులో కర్ణాటక రవాణా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రవాణా శాఖ అధికారుల దాడుల్లో మొత్తం ఏడు లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకోగా, వాటిలో ఒకటి బిగ్ బి అమితాబ్ పేరిట ఉండడం ఆశ్చర్యం కలిగించింది. ఈ తెల్లరంగు రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును అమితాబ్ కు 2007లో ఏకలవ్య చిత్రం సందర్భంగా దర్శకుడు విధు వినోద్ చోప్రా బహూకరించారు. అయితే, సీనియర్ బచ్చన్ ఈ కారును ఉమ్రా డెవలపర్స్ సంస్థ యజమాని యూసుఫ్ షరీఫ్ అలియాస్ డి బాబు అనే వ్యక్తికి విక్రయించారు.

కానీ ఆ కారు రిజిస్ట్రేషన్ ఇప్పటికీ అమితాబ్ పేరిటే ఉంది. కాగా, పన్నులు కట్టని, ఇన్స్యూరెన్స్ తదితర సరైన పత్రాలు లేని కారణంగానే తాము సదరు లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నామని కర్ణాటక రవాణా శాఖ వెల్లడించింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •