రాజకీయం (Politics) వార్తలు (News)

వచ్చే నెల 2న ఢిల్లీ లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ?

ఢిల్లీ లో టిఆర్ఎస్ ఆఫీసు నిర్మాణంకు వచ్చే నెల 2 న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజ చేయనున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భావన్ లో పార్టీ మీటింగ్ అనంతరం ఆయన మాట్లాడుతూ 24, 25 జిల్లా లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పూర్తి అయ్యిందన్నారు.

విజయ దశమి సమయంలో పార్టీ కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభిస్తారని, భూమి పూజ కార్యక్రమంకు రాష్ట్ర కార్యవర్గం, ఎమ్మెల్యేలు, ఎంపీలు,మంత్రులు ,ఎమ్మెల్సీలు హాజరు అవుతారని వెల్లడించారు. సెప్టెంబర్ 2 న 12 వేల 769 గ్రామ కమిటీల నిర్మాణము జరుగనుందని చెప్పారు. 3854 వార్డు కమిటీల నిర్మాణం పూర్తి అవుతుందన్నారు. కొత్తగా జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేస్తామని.. సరికొత్త రాష్ట్ర కమిటీ కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    42
    Shares
  • 42
  •  
  •  
  •  
  •