రాజకీయం (Politics) వార్తలు (News)

ఇకపై ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ తప్పనిసరి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుండి ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరును తప్పనిసరి అని ప్రకటించింది. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ కీలక ఉత్తర్వులకు జారీ చేశారు.

కరోనా కారణంగా గతేడాది మే నెల నుంచి బయోమెట్రిక్ హాజరుకు రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నెల 13వ తేదీన అన్ని శాఖల కార్యదర్శులతో సీఎస్ ఆదిత్యనాధ్ సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ సమావేశంలో బయోమెట్రిక్ హాజరును పునరుద్దరించాలనే అంశంపై కీలకంగా చర్చించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు హజరుపైనా చర్చ జరిగింది. చాలా మంది కార్యాలయాలకు టైంకు రాకపోవడం, వచ్చినా బయటకు వెళ్లడం, సమయం పూర్తి కాకపోయినా ముందుగానే ఆఫీసుల నుండి వెళ్లిపోవడం వంటి విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో బయోమెట్రిక్ హజరును పునరుద్దించాలని సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఆదేశించారు. ఈ క్రమంలోనే సచివాలయంతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న బయోమెట్రిక్ పరికరాలను తిరిగి సిద్ధం చేయాలని ఐటీ శాఖకు తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •