ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

హైబీపీ కి ఈ ఆహారాలతో చెక్ పెట్టండి !!

ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యల్లోహైబీపీ కి ఈ ఆహారాలతో చెక్ పెట్టండి !!కూడా చెప్పుకోవచ్చు. మారుతున్న జీవన శైలి, ఆరోగ్య అలవాట్ల కారణంగా 30 ఏళ్లు కూడా నిండని వారు సైతం రక్తపోటుతో బాధపడుతున్నారు.

ఒక్కసారి హైబీపీ ఎటాక్​ అయ్యిందంటే జీవితాంతం ప్రతిరోజూ మందులు వేసుకోవాల్సిందే. ఇది క్రమంగా హృదయ సంబంధిత రోగాలకు కూడా దారి తీస్తుంది. అందుకే, హైబీపీ రాకుండా అత్యంత జాగ్రత్త వహించాలి. మనం రోజూ తీసుకునే కొన్ని ఆహార పదార్థాలతో హైబీపీని కంట్రోల్​ చేయవచ్చు. ముఖ్యంగా బెర్రీలు, యాపిల్స్, బేరి, రెడ్ వైన్ వంటి ఫ్లేవనాయిడ్ అధికంగా ఉండే పండ్లు, పానీయాలతో మీ సిస్టోలిక్ రక్తపోటు స్థాయి తగ్గించుకోవచ్చు. ఇవి మీ గట్ బ్యాక్టీరియాను తొలగించి రక్త ప్రసరణ స్థాయిని మెరుగుపరుస్తాయి.

హైపర్‌టెన్షన్ జర్నల్‌లో ప్రచురించిన తాజా అధ్యయనం ప్రకారం, ఫ్లేవనాయిడ్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం ద్వారా సిస్టోలిక్ రక్తపోటును 15.2 శాతం తగ్గించుకోవచ్చని తేలింది. రోజుకు 1.6 సర్వింగ్​ బెర్రీలు (ఒక సర్వింగ్ 80 గ్రాములు లేదా 1 కప్పుతో సమానం) తీసుకోవడం ద్వారా సిస్టోలిక్ రక్తపోటు స్థాయి 4.1 mm Hg తగ్గుతుంది. వీటి ద్వారా దాదాపు 12 శాతం గట్ మైక్రోబయోమ్ ఫ్యాక్టర్స్​ తొలగిపోతాయి. మరోవైపు, వారానికి 2.8 గ్లాసుల (గ్లాసుకి 125 మి.లీ వైన్) రెడ్ వైన్ తాగడం వల్ల సగటున 3.7 mm Hg సిస్టోలిక్ రక్తపోటు స్థాయి తగ్గుతుందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •