వార్తలు (News)

తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఆలస్యం కావడంతో ప్రయాణికులకు పరిహారం??

దేశంలోనే తొలి ప్రైవేటు రైలుగా తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ ను తెచ్చుకోవచ్చు. విమానంలో ఉన్న మాదిరి సౌకర్యాలు ఉండే ఈ రైలు ఢిల్లీ నుంచి లక్నోకు రాకపోకలు సాగిస్తుంది. అయితే ఈ రైలు కచ్చితత్వం విషయంలో ప్రయోగాత్మకంగా ఓ నిబంధన విధించారు. రైలు నిర్దేశించిన సమయానికి వెళ్లకపోతే ఎంత ఆలస్యమైతే అంత పరిహారం చెల్లిస్తామని భారతీయ రైల్వే క్యాటరింగ్‌, పర్యాటక కార్పొరేషన్‌ (ఐఆర్‌సీటీసీ) ప్రకటించడంతో తాజాగా ఆ రైలు రెండు గంటలు ఆలస్యంగా ప్రయాణించి పరిహారం ప్రయాణికులకు అందివ్వవలసి వచ్చింది. ఎప్పుడూ చార్జీల వసూళ్లు చేయడమే తప్ప నష్టపరిహారం ఇవ్వడం అలవాటు లేని రైల్వే ఇప్పుడు పరిహారం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది.

తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ఈ శని, ఆదివారం (ఆగస్ట్‌ 21, 22)లో రెండు గంటలు ఆలస్యంగా ప్రయాణించింది. ఆలస్యంగా ప్రయాణించడంతో రైలులో ప్రయాణించిన మొత్తం 2,035 మంది ప్రయాణికులకు రూ.నాలుగున్నర లక్షలు పరిహారంగా చెల్లించాలని నిర్ణయించింది. భారీ వర్షాల నేపథ్యంలో శనివారం సిగ్నల్‌ ఫెయిల్‌ కారణంగా న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌కు రెండున్నర గంటలు ఆలస్యంగా రైలు చేరింది. ఆదివారం కూడా గంట ఆలస్యమైంది.

గంట ఆలస్యమైన వారికి రూ.100 చొప్పున, రెండున్నర గంటలు ఆలస్యమైన వారికి రూ.250 చెల్లించనుంది. మొత్తం రూ.4,49,600 పరిహారం ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ అందించనుంది. ఈ విషయాన్ని ఐఆర్‌సీటీసీ చీఫ్‌ రీజనల్‌ మేనేజర్‌ అజిత్‌ కుమార్‌ సిన్హా తెలిపారు. నిబంధనల మేరకు రైలు గంట ఆలస్యమైతే రూ.వంద చెల్లించాలనే నిబంధన ఉందని, ఆ మేరకు ఆలస్యమైన వారికి అంతే చొప్పున పరిహారం అందిస్తున్నట్లు వెల్లడించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •