ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

భారత్‌లో కొవిడ్‌ ‘ఎండెమిక్‌’ దశకు చేరుకుందా??

భారత్‌లో కొవిడ్‌ ఒక మోస్తరు స్థాయిలో ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి (ఎండెమిక్‌) దశలోకి మారుతున్నట్లు కనిపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ముఖ్య శాస్త్రవేత్త డాక్టర్‌ సౌమ్య స్వామినాథన్‌ అభిప్రాయపడ్డారు. సెప్టెంబరు మధ్య నాటికి భారత్‌ బయోటెక్‌ ‘కొవాగ్జిన్‌’ టీకాకు డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక బృందం ఆమోదం తెలిపే అవకాశం ఉందని, భారత్‌లో జనాభా, రోగనిరోధక శక్తిలో వైవిధ్యాలను బట్టి చూస్తే కొద్దిపాటి హెచ్చుతగ్గులతో కొవిడ్‌ ప్రస్తుత తరహాలోనే దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉందని ఆమె చెప్పారు.

2022 ఆఖరు నాటికి.. 70% వ్యాక్సినేషన్‌ పూర్తయి, కొవిడ్‌కు ముందునాటి పరిస్థితులు తిరిగి వస్తాయన్న ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు. పిల్లల్లో కొవిడ్‌ వ్యాప్తిపై మాట్లాడుతూ ఈ విషయమై తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పిల్లలకు కొవిడ్‌ సోకినప్పటికీ వ్యాధి అతి స్వల్పంగానే ఉంటుందని, తక్కువ శాతం మంది మాత్రమే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుందని, పెద్దవారితో పోలిస్తే మరణాలు కూడా చాలా తక్కువ ఉంటాయని అన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •