వార్తలు (News)

బొట్టు ఎందుకు పెట్టుకోవాలో తెలుసా??

నుదుటన బొట్టు తో ఆడవారికి వచ్చే అందం వెలకట్టలేనిది. ఎన్ని అలంకారాలు చేసిన ఆడవారి నుదుటన బొట్టులేకపోతే ఆ అలంకారం వ్యర్థం అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. పురాతన కాలం నుంచి ఈ బొట్టు సంప్రదాయం అనేది ఆచారంగా కొనసాగుతూ వస్తుంది.

అయితే ఈమధ్య ఫ్యాషన్ అనే పేరుతో ఆడవాళ్లు బొట్టు పెట్టుకోవడం మానేస్తున్నారు. ఒకవేళ బొట్టు పెట్టుకున్నా అది కూడా కనిపించి కనిపించనట్టు పెడుతున్నారు. మన హైందవ ధర్మం ప్రకారం ముఖాన బొట్టుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మన పెద్దలు ఎప్పుడు అంటూ ఉంటారు. ముఖాన బొట్టులేకున్నా, ఇంటి ముందు ముగ్గులేకున్నా గాని ఆ ఇంటిలో దరిద్ర దేవత తాండవం చేస్తుందని అనేవారు! అందుకే మీ ఇంట్లో లక్షి దేవి నిలవాలంటే మీ ముఖానికి బొట్టు కచ్చితంగా పెట్టుకోవాలి.

ఇవన్నీ పక్కన పెడితే బొట్టు వెనుక సైన్టిఫిక్ రీజన్ కూడా ఉందని మీకు తెలుసా?? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోండి.. ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు మొదటగా వారి ద్రుష్టి మన నుదిటి మీద పడుతుంది మీకు తెలుసో లేదో నరుడు దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది. అలాగే ఎవరయినా మన ముఖాన్ని చూస్తే వారి చూపులో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మన కనుబొమ్మల మధ్యలో పడుతుంది. అలాగే మన శరీరంలో ఉండే నాడులలో కొన్ని సున్నితమైన నాడులు రెండు కనుబొమ్మలకు మధ్యభాగంలో కేంద్రీ కృతం అయి ఉంటాయి.

ఎప్పుడైతే నరుడు నయాకారాత్మకశక్తి కనుబొమ్మల మధ్యలో పడుతుందో అప్పుడు అక్కడ ఉన్నటువంటి సున్నితమైన నాడులు ఒత్తిడికి గురయి ఆ ప్రభావం మెదడుపై పడి ఫలితంగా మెదడుకి ఒత్తిడి పెరిగే తలనొప్పి రావడం, చిరాకు రావడం వంటివి వస్తాయి.అందుకనే ఎదుటివారి కంటిచూపు నుండి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం మన కనుబొమ్మల మధ్య భాగంలో వాళ్ళ కంటి చూపు పడకుండా ఏదైనా అడ్డంగా పెట్టాలి. అది బొట్టయితే మరి మంచిది. అందుకే బొట్టు పెట్టాలని మన పూర్వికులు చెబుతూ ఉంటారు. బొట్టు పెట్టుకోవడం అనేది సంప్రదాయం ప్రకారమే కాకుండా సైన్స్ ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది. అందుకే బొట్టు పెట్టుకోవాలి అని పెద్దలు అంటూ ఉంటారు. సింధూరం పెట్టుకుంటే వచ్చే కళ మరేమి పెట్టుకున్న రాదన్నది అందరికీ తెలిసిన విషయమే కదా!!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •