వార్తలు (News)

వివాహ వేడుకకు వధువును తీసుకెళ్తుండగా ఆటో నుండి జారిపడి నలుగురి మృతి!!

ప్రకాశం జిల్లా తర్లుపాడు- కొనకనమిట్ల మండలాల సరిహద్దు కలుజువ్వలపాడు జాతీయ రహదారిపై వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఆటో నుంచి జారిపడి నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. ఘటనాస్థలంలోనే ఇద్దరు మృతిచెందగా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మరో ఇద్దరు చనిపోయారు. మృతులను కనకం కార్తీక్‌, అనిల్‌, బోగాను సుబ్బారావు, శ్రీనుగా గుర్తించారు.

వివాహ వేడుకకు వధువును తీసుకుని త్రిపురాంతకం మండలం సోమేపల్లి నుంచి పొదిలి అక్కచెరువు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వధువు ఆటో ముందు భాగంలో కూర్చోవడంతో ఆమెకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. క్షతగాత్రులను మార్కాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఉదయం 11 గంటలకు వివాహం జరగాల్సి ఉండగా ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో పెళ్లింట విషాదం నెలకొంది. వధువు సహా కుటుంబసభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •