ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

మూడో వేవ్ కు సిద్ధం అవుతున్న కేరళ ప్రభుత్వం..??

మూడో వేవ్ కూడా కేరళను ఇబ్బంది పెట్టె అవకాశం ఉందని అంచనా వేస్తుండడంతో కేరళ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజలను సిద్దంగా ఉంచుతుంది. అటు అధికారులు వ్యాక్సినేషన్ కు సంబంధించి స్పీడ్ పెంచారు.

రాబోయే నాలుగు వారాలు కీలకమని, ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. ఓనమ్ సంబరాలకు ముందు కేసులు పెరిగినప్పటికీ కరోనా కేసులు ఉన్న ప్రాంతాల మీద దృష్టి పెట్టామని తెలిపింది. రాబోయే నాలుగు వారాల పాటు రాష్ట్రం మరింత అప్రమత్తంగా ఉండాలి అని హెచ్చరించారు. 490 ఆక్సిజన్ అమర్చిన పీడియాట్రిక్ బెడ్స్ అలాగే 158 హై డిపెండెన్సీ యూనిట్లు (HDU) బెడ్స్ అలాగే మరియు 96 ఐసియు బెడ్స్ కొత్తగా ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఆక్సీజన్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకున్నామని అన్నారు.

రాష్ట్రంలో మొత్తం 870 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ నిల్వలు ఉన్నాయని, 77 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయగల 33 ఆక్సిజన్ జనరేషన్ యూనిట్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైవేట్ ఆసుపత్రులు రోజుకు 13 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి అన్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •