టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

తెలంగాణ ఆర్టీసీ కి లాభాలు తెచ్చిపెట్టిన రక్షాబంధన్!!

రక్షా భంధన్ పండుగ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కి లాభాలు తెచ్చి పెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్టీసీ సిబ్బందిని ప్రశంసించారు. 78 శాతం ఒ.ఆర్ తో’ రికార్డు నెలకొల్పిన తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ గణనీయంగా ఈ నెల 23 వ తేదీన ఏకంగా రూ .13.04 కోట్ల ఆదాయం తెచ్చిపట్టింది.

ఈ మధ్య కాలం లో ఎన్నడూ లేనంతగా ఈ నెల 23 వ తేదీన 78 శాతం ఆక్యుపెన్సీ రేషియో ( ఒ.ఆర్ ) తో రూ. 13.04 కోట్ల ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఆర్జించిందని ఆయన స్పష్టం చేశారు. ఈ రికార్డు సిబ్బంది , అధికారుల దేనంటూ అభినందించారు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. బస్సుల నిర్వహణ ద్వారా 78 శాతం ఒ.ఆర్ సాధించడం ఓ మైలు రాయి అని రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ స్పష్టం చేశారు. 31.77 లక్షల కిలో మీటర్లు బస్సు లను నడపి 41.05 ఇ.పి.కె (ఎర్నింగ్ ఫర్ కిలో మీటర్) సాధించడం సిబ్బంది పని తీరు కు నిదర్శనమని ఆయన కొనియాడారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •