అంతర్జాతీయం (International) వార్తలు (News)

‘డెల్టా’ వేరియంట్ తో ఇరాన్‌లో రికార్డు స్థాయిలో మరణాలు??

ఇరాన్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సంగతి పాఠకులకు విదితమే కదా! గడిచిన 24గంటల వ్యవధిలోనే 709మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఇరాన్‌ ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. వైరస్‌ బారినపడిన వారిలో మరో 7,727మంది రోగుల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు, నిన్న ఒక్కరోజే 40,600 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు, ఇరాన్‌లో వైరస్‌ వ్యాప్తి ఇంతలా పెరగడానికి కారణం డెల్టా వేరియంటేనని అధికారులు పేర్కొంటున్నారు.

కరోనా కట్టడికి విధించిన ఐదు రోజుల కఠిన లాక్‌డౌన్‌ ఇటీవలే ముగిసింది. ఇప్పటివరకు కేవలం ఎనిమిది శాతం మంది ఇరాన్‌ ప్రజలు మాత్రమే పూర్తిగా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. అలాగే, తమ దేశంలో 40శాతం కన్నా తక్కువ మంది ప్రజలు మాత్రమే మాస్క్‌లు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటి కొవిడ్‌ నిబంధనలను పాటిస్తున్నారని అధికారులు అంటున్నారు. అందుకే కరోనా అక్కడ విలయతాండవం చేస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •