జాతీయం (National) వార్తలు (News)

నెమ్మదిగా కిందకి దిగొస్తున్న పెట్రోల్ ధరలు??

ఇటీవల కాలంలో పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా వాహనదారులు తమ వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నారు. ఈ తరుణంలో చమురు కంపెనీలు వాహనదారులకు కాస్త ఊరటనిస్తూ పెట్రోల్‌, డీజిల్ ధరలను స్వల్పంగా తగ్గించాయి. మంగళవారం పెట్రోల్ ధరపై రూ.15పైసలు, డీజిల్ ధరపై రూ.15 పైసలు తగ్గించాయి. మే, జూలై మధ్య 42 రోజుల పాటు ధరల్లో పెరుగుదల నమోదవగా.. లీటర్‌పై రూ.11.52, డీజిల్‌పై 41 రోజుల్లో లీటర్‌పై 9.08 వరకు పెరిగింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రిగా హర్దీప్‌ సింగ్‌ పూరి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ధరలు జూలై 18 నుంచి స్థిరంగా కొనసాగుతూ వచ్చాయి. ఈ నెల 22న పెట్రోల్‌ ధరపై 20 పైసలు తగ్గగా.. తాజాగా మరోసారి 15 పైసలు వరకు తగ్గింది.

ప్రధాన నగరాల్లో ఇంధన ధరలు ఎలా ఉన్నాయో చూడండి..

ఢిల్లీలో పెట్రోల్‌ రూ.101.49, డీజిల్‌ రూ.88.92
ముంబైలో పెట్రోల్‌ రూ.107.52, డీజిల్‌ రూ.96.48
హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.105.54, డీజిల్‌ రూ.96.99
కోల్‌కతాలో పెట్రోల్‌ రూ. 101.82, డీజిల్‌ రూ.91.98
బెంగళూరులో పెట్రోల్‌ రూ.104.98, డీజిల్‌ 94.34
భోపాల్‌లో పెట్రోల్‌ రూ.109.91, డీజిల్‌ రూ.97.72
లక్నోలో పెట్రోల్‌ రూ.98.56, డీజిల్‌ రూ.89.29
రాంచీలో పెట్రోల్‌ రూ.96.47, డీజిల్‌ రూ.93.86
చెన్నైలో పెట్రోల్‌ రూ.99.20, డీజిల్‌ రూ.93.52
చండీగఢ్‌లో పెట్రోల్‌ రూ.97.66, డీజిల్‌ రూ.88.62
పాట్నాలో పెట్రోల్‌ రూ.103.99, డీజిల్‌ రూ.94.75

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •