జాతీయం (National) వార్తలు (News)

యూఐడీఏఐ సైట్లో నుండి రెండు సేవలు నిలిపివేత??

మన దేశంలో ఆధార్ కార్డు అనేది ప్రతి ఒకరికి చాల అవసరం! అన్నిటికి ఆధార్ కార్డు నే గుర్తింపు పత్రంగా ఉపయోగిస్తారు. పాస్ పోర్టు కోసం ధరఖాస్తు చేసుకోవాలన్న, కొత్త బ్యాంకు అకౌంట్ తీసుకోవాలన్న ఆధార్ కార్డు అవసరం. ఇలాంటి ముఖ్యమైన ఆధార్ కార్డులో పేరు, చిత్రం, చిరునామా వంటి మొదలైన వివరాలను అప్ డేట్ చేయడం కోసం యూఐడీఏఐ అనేక సేవలను ఆన్ లైన్ చేసింది. కానీ ఇప్పుడు తాజాగా ఆధార్ కార్డుతో ముడిపడి ఉన్న రెండు సేవలను యూఐడీఏఐ నిలిపివేసింది. అవి ఏంటో చూద్దామా??

ఆధార్ కార్డులో మీ చిరునామాను అప్ డేట్ చేయడం కోసం చిరునామా ధ్రువీకరణ లేఖ పంపించేది. ఆ లేఖలో ఒక సీక్రెట్ కోడ్ ఉంటుంది. అందులో ఉన్న కోడ్ వివరాలను నమోదు చేసిన తర్వాత మీ చిరునామా మార్పు జరిగేది. కానీ గత కొంత కాలంగా చిరునామాను అప్ డేట్ చేసేటప్పుడు చిరునామా ధ్రువీకరణ లేఖ ఎంపికను యూఐడీఏఐ పోర్టల్ నుంచి తొలగించింది. అలాగే ఆధార్ కార్డుదారులు రి ప్రింట్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు గతంలో ఒక పెద్ద పేపర్ మీద మీ వివరాలు వచ్చేవి. ఇప్పుడు ఆ సదుపాయాన్ని నిలిపివేసింది. అందుకు బదులుగా యూఐడీఏఐ ప్లాస్టిక్ ఆధార్ కార్డులను మాత్రమే జారీ చేస్తుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •