క్రైమ్ (Crime) వార్తలు (News)

15 వేలతోనే ముగ్గురిని హతమార్చిన వైనం??

ఖమ్మం జిల్లాలో కల్తిమద్యం తాగి ముగ్గురు చనిపోయారని ఇటీవల వచ్చిన వార్తల రహస్యాన్ని పోలీస్ లు ఎట్టకేలకు చెందించారు. భూ తగాదాలతో చాలా రోజులుగా పథకం రచించి సమయం కోసం వేచి చూసిన ప్రత్యర్థులు ముగ్గురుని ఒకేసారి మరణ శయ్యపై పడుకునేలా చేసారు.

ఖమ్మం తిరుమాలాయ పాలేం చంద్రతండాకు చెందిన బోడ హరిదాస్ ,భధ్రు మల్సూర్ కుటుంబానికి అదే గ్రామానికి చెందిన బోడ బిచ్చా కుటుంబాల మధ్య గత 15 సంవత్సరాలుగా భూ తగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే బిచ్చా కొడుకు చిన్నా, ఆ ముగ్గురిపై కక్ష తీర్చుకోవాలని నిర్ణయించాడు. అందు కోసం వారిని హతమార్చాలని ప్లాన్ వేశాడు. దీంతో అనేక సార్లు వారిపై దాడి చేసి హత్య చేయాలని ఆరునెలల పాటు ప్లాన్ చేసిన వర్కౌట్ కాలేదు.

ఈ నేపథ్యంలోనే చిన్నాకు మరో అవకాశం వచ్చింది..బిచ్చా పెద్ద కొడుకు తన అన్న అయిన అర్జున్ చనిపోవడంతో వారు ఆ ముగ్గురు ప్రత్యర్థులు పాల్గొన్నారు.. తమ బంధువులే కావడంతో సంఘీభావంగా చావుకు హజరయ్యారు. అయితే ఇదే అదనుగా తీసుకున్న చిన్నా..తన దశదిన కర్మరోజు మట్టుబెట్టాలని డిసైడ్ చేశాడు..అనుకున్నట్టుగానే ఈ నెల 14న చనిపోయిన అర్జున్ దశదిన కర్మ నిర్వహించడంతో వారిని అహ్వానించారు. దీంతో అందులో అంతకుముందే సైనెడ్ కలిపి ఉంచిన మందును ఆఫర్ చేశాడు. దీంతో ఇదేది తెలియని బాధితులు మద్యం సేవించడంతో అనారోగ్యం పాలై ప్రాణాలు వదిలారు..దీంతో ఒకేసారి ముగ్గురు గ్రామస్థులు చినిపోవడంతో సంచలనంగా మారింది..మరోవైపు కల్తీ మద్యం తెరపైకి రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

ఈ హత్యల కోసం చిన్నా చాలా రోజులుగా స్కెచ్ వేసినా ఫలితం లేకపోవడంతో స్మార్ట్‌గా హత్యచేయాలని బావించి దానికోసం సైనెడ్ ఉపయోగించాడు. అదికూడా తన మిత్రుల సహాకారంతో బంగారం దుకాణంలో 15 వేల రూపాయలు పెట్టి సైనెడ్ కొనుగోలు చేశారు. దీంతో ప్లాన్ పక్కాగా వేసి హతమార్చారు. ఇలా పదిహేను వేల రూపాయలతో ప్రాణాలు తీసిన చిన్నా. పద్నాలుగు సంవత్సరాల పాటు జైలు జీవితం గడుపుతాననే ఆలోచన లేకుండా ప్రవర్తించడం అమానుషం!

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    25
    Shares
  • 25
  •  
  •  
  •  
  •