ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

ప్లేగు వ్యాధి టీకా పరీక్షించడానికి కన్నబిడ్డను పణంగా పెట్టిన యోధుడు??

ఇప్పుడు కొవిడ్‌ మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్నట్టే 1896లో ప్లేగు వ్యాధి ముంబయిని అతలాకుతలం చేసింది. లక్షల సంఖ్యలో ప్రజలు మరణించగా బ్రిటిష్‌ ప్రభుత్వం కూడా ఏమీ చేయలేక మిన్నకుండిపోయింది. ఉక్రేనియన్‌ బ్యాక్టీరియాలజిస్టు డాక్టర్‌ వాల్డెమర్‌ హఫ్‌కిన్‌ సారథ్యంలో ప్లేగు పరిశోధన కమిటీ కష్టపడి టీకా తయారు చేసింది. బలహీనమైన బ్యాక్టీరియాను వ్యాధిబారిన పడని వారి శరీరంలోకి ఎక్కించటం ద్వారా యాంటీబాడీలు తయారై రోగనిరోధక శక్తి పెరుగుతుందని గుర్తించారు. టీకా తయారైనప్పటికీ పరీక్షించడానికి ఎవరు లేరు.

ముంబయిలో ఎవ్వరూ టీకా తీసుకోవటానికి ముందుకు రాలేదు. విదేశీ మందుపై అపనమ్మకం ఒక కారణం కాగా, బ్రిటిష్‌ ప్రభుత్వ పాలన మరొక కారణం! బ్రిటిష్‌ వారు ప్రజల ప్రాణాలు తీయటానికి ఈ టీకా రూపంలో ప్రయత్నిస్తున్నారనే వదంతు ప్రచారంలో ఉండడంతో అంతా టీకా పరీక్షలకు దూరంగా ఉన్నారు. ఈ దశలో బరోడా మహారాజు సయాజీరావు గైక్వాడ్‌ ముందుకొచ్చి తమ రాష్ట్రంలో పరీక్షించాల్సిందిగా ఆహ్వానించారు. కానీ అక్కడ ప్రజల నుంచి కూడా సానుకూలత లేదు.

ఈ దశలో ధైర్యంగా ముందుకొచ్చిన అబ్బాస్‌ త్యాబ్జి అదే సమయంలో బరోడా రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఆయన తన కూతురు షరీఫాపై టీకాలను పరీక్షించి చూడాలంటూ తీసుకొచ్చారు. తద్వారా ప్రజల్లో భయాందోళనలు పోగొట్టడానికి, వారిలో స్ఫూర్తినింపటానికి యత్నించారు. టీకా తీసుకున్న షరీఫా (ప్రముఖ చరిత్రకారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ తల్లి) ఆరోగ్యకరంగానే ఉండటంతో ప్రజల్లోనూ నమ్మకం కలిగింది. బరోడాలోని పల్లెటూర్లకు కూడా వెళ్లి టీకాలిచ్చి హఫ్‌కిన్‌ బృందం పరీక్షించడంతో వారి పరీక్షలు ఫలించి టీకా వల్ల మరణాలు 97% తగ్గాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •