దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 11లక్షల మందికిపైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 7,189 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3.47 కోట్లకు చేరింది. నిన్న ఒక్కరోజే 387 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు కరొనతో మృతి చెందిన వారి మొత్తం సంఖ్య 4,79,520 కు చేరింది. గత 24 గంటల్లో 7,286 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు కరోనా ను జయించిన వారి మొత్తం సంఖ్య
3.42 కోట్లకు చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసులు 77,032కి చేరాయి.

ఇక కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విషయానికి వస్తే శరవేగంగా వ్యాప్తి చెందుతూ ప్రభుత్వాలను కలవర పెడుతుంది. 24 గంటల కృతంగా వరకు 358గా ఉన్న కేసుల సంఖ్య 24 గంటల్లో 415కి పెరిగింది.