నేటితరం ఆహార అలవాట్ల కారణంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి చాలా మంది గుండె జబ్బులతో ప్రాణాలను విడుస్తున్నారు. అందుకే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహార అలవాట్లను దినచర్యలో భాగం చేసుకోవాలి. గుండె జబ్బులను దూరం చేయడంలో బ్లాక్ టీ అద్భుతంగా సహాయపడుతుంది. సాధారణంగా ఉదయం చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. ఉదయం లేవగానే ఓ కప్పు టీ తాగనిదే చాలా మందికి రోజు మొదలవ్వదు. ఇక టీలో చాలా రకాలు ఉన్నాయి. అయితే కాస్త ఆరోగ్యం గురించి ఆలోచించే వారు మాత్రం గ్రీన్ టీ, బ్లాక్ టీ సేవిస్తుంటారు. ముఖ్యంగా బ్లాక్ టీ విషయానికి వస్తే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా అధిక శాతం మంది బ్లాక్ టీను ఇష్టంగా తాగుతుంటారు.బ్లాక్ టీని తాగడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఫలితంగా గుండె సంబంధిత సమస్యల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ కరోనా కాలంలో ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడం ఎంతో అవసరం.

బ్లాక్ టీ తాగితే అందులో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీర రోగ నిరోధక శక్తిని అద్భుతంగా మెరుగుపరుస్తుంది. ఇక అధిక బరువుతో బాధ పడుతున్నవారికి బ్లాక్ టీ బెస్ట్ అప్షన్. ప్రతి రోజు రెండు కప్పుల బ్లాక్ టీ తాగడం వల్ల బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే నేటి ఉరుకుల పరుగుల జీవితంలో దాదాపు అందరూ ఒత్తిడికి గురవుతున్నారు. అయితే రెగ్యులర్‌గా బ్లాక్ టీ తాగడం వల్ల ఒత్తిడి, మానసిక ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభించడంతో పాటు తక్షణ శక్తి లభిస్తుంది.

బ్లాక్-టీ అనేది కాల్షియంకు ప్రత్యామ్నాయంగా ఉంటుంది. కాబట్టి, రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు బ్లాక్ టీ తాగడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా మారతాయి. అలాగే
ఈ శీతాకాలంలో చాలా మంది అలెర్జీ సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు బ్లాక్ టీ తాగితే అలెర్జీలకు కూడా దూరంగా ఉండొచ్చు.