విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కు చెందిన బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ప్లాంట్‌-2లో ఒక ట్యూబ్‌కు రంధ్రం పడటంతో లిక్విడ్‌ ద్రావకమంతా నేలపై ఒలికి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు ఫైర్‌ సిబ్బందికి సమాచారం అందివ్వగా ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. భారీగా ఆస్తినష్టం సంభవించి ఉండొచ్చని సమాచారం.