ఆటో, కారు బుకింగ్‌ తర్వాత తమకు గిట్టుబాటు కావడం లేదని కొందరు డ్రైవర్లు రైడ్లను అకస్మాతుగా రద్దు చేసుకుంటుండడంతో నిత్యం వేలాదిమంది ప్రయాణికులు రోడ్లపై తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇదే విషయాన్ని పలువురు నెటిజన్లు ఓలా దృష్టికి తీసుకెళ్లగా రైడ్‌ రద్దు ప్రక్రియకు పరిష్కారం చూపింది.

ఇక మీదట కస్టమర్‌ క్యాబ్‌ బుక్‌ చేసిన వివరాలు డ్రైవర్‌కు కనిపించేలా ఓలా యాప్‌లో స్వల్ప మార్పులు చేశారు. లొకేషన్‌, పేమెంట్‌ వివరాలన్నీ సదరు డ్రైవర్‌కు కనిపిస్తాయి. రైడ్‌ తనకు అంగీకారమైతే ప్రొసీడ్‌ కావొచ్చు. లేదంటే రైడ్‌ను యాక్సెప్ట్‌ చేయాల్సిన అవసరం లేదు. మార్పులు చేర్పులపై క్యాబ్‌ ప్రయాణికులు, డ్రైవర్ లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానంలో ఇద్దరికీ ప్రయోజనం కలుగుతుంది.