గ్రేటర్‌ పరిథి శేరిలింగంపల్లి మండలం మదీనాగూడలో 3.5 ఎకరాలకు పైగా స్థలంలో 49 అంతస్తుల్లో భారీ భవనాన్ని నిర్మించేందుకు ఒక నిర్మాణ సంస్థ జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసింది. అయితే బల్దియా కమిషనర్‌ లోకేష్‌కుమార్‌ దీనికి ఆమోదముద్ర వేయాల్సి ఉంది.

ప్రస్తుతానికి నానక్‌రామ్‌గూడలో చేపడుతున్న 44 అంతస్తుల భవనమే ఎత్తయినది. మదీనాగూడలో 4 సెల్లార్లు, ఒక స్టిల్ట్‌, 49 అంతస్తుల్లో నివాస గృహాలు నిర్మించనున్నట్లు జీహెచ్‌ఎంసీకి పెట్టిన అర్జీలో పేర్కొన్నారు. అనుమతి లభించి, భవనం నిర్మిస్తే గ్రేటర్‌లో ఇదే అత్యంత ఎత్తయిన భవనం అవుతుంది.