తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య శాఖకు వివిధ పద్దుల కింద మొత్తం రూ. 337.5 కోట్ల నిధులను విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో ఆక్సిజన్ ప్లాంట్లతో పాటు ఆస్పత్రుల వసతుల కల్పన, జాతీయ ఆరోగ్య మిషన్ తో పాటు ఇతర అవసరాలకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నారు. ఈ మొత్తం లో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కు రూ. 121.82 కోట్లు విడుదల చేసింది.

ఆస్పత్రుల స్థాయి పెంపు, పరికరాల కొనుగోలు వంటి వాటి కోసం వైద్య విధాన పరిషత్ కమిషనర్ కు రూ. 120 కోట్లు విడుదల చేసింది. ఇందులో భాగంగా మెడికల్ కాలేజీల నిర్మాణంకై రూ. 25 కోట్లు, బోధనాస్పత్రుల ఏర్పాటు కోసం రూ. 50 కోట్లు ను వైద్య విద్య సంచాలకులకు విడుదల అయ్యాయి.

దీంతో పాటు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు కోసం రూ. 13.68 కోట్లు, వైద్య పరికరాల కొనుగోలు కోసం రూ. 5 కోట్లు, భవనాల నిర్మాణం కోసం మరో రూ. 2 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం నుండి విడుదలయ్యింది.