సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు గజాయి తరలిస్తున్న నలుగురు అంతర్రాష్ట్ర నేరగాళ్ళను అదుపులోకి తీసుకుని వీరి నుండి 80 కేజీల గంజాయి, ఓ కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


ఈ కేసులో ప్రధాన నిందితుడు పాతబస్తి బండ్లగూడలో చంద్రాయాణగుట్టకి చెందిన షేక్ మెహ్ రాజ్. గతంలో సైబరబాదులొ చైన్ స్నాచింగుకి, కర్నాటకలొ రాబరీ చేసి జైలు కెళ్లి వచ్చినా కూడా తనలొ మార్పు రాలేదు. తనకు ఉన్న దురాశతో తక్కువ సమయంలో అధిక డబ్బు సంపాదించాలని ఆరుమందితో గ్యాంగును తయారు చేసారు.

షేక్ మెహ్ రాజ్ చంద్రాయణగుట్ట బండ్ల గూడ వాసి అబ్దుల్ రవూఫ్, మరో ఇద్దరు మహరాష్ట్ర, నాగపూర్ కు చెందిన షఫీక్ ఖాన్, ఇర్ఫాన్ అలీ మరొక ఇద్దరితో కలిసి మొత్తం ఆరుగురు గంజాయి వైజాగ్ నుండి కొనుగోలు చేసి హైదరాబాద్, నాగపూర్ కి రవాణా పాల్పడుతున్నారన్న ముఖ్య సమాచారం అందుకున్న సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు నిఘావేసి నలుగురిని అదుపులోకి తీసుకుని వీరి వద్దనుండి ౮౦ కేజీల గంజాయి, ఒక కారు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని తదుపరి విచారణకు కంచం బాగ్ పోలీసులకు అప్పగించారు.వీరిలో పరారీలో ఉన్నవాళ్ళ పేర్లు నదీం, డ్రాగన్ @ అవేజ్లు. వీరిని పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.