గోదావరి ఖని ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేస్తున్న ఉద్యోగి రెండు విడతల్లో కరోనా వాక్సిన్ తీసుకున్నాక కూడా కరొనకు గురవ్వడంతో వైద్యులు అవాక్కయ్యారు.బ్లడ్ బ్యాంకు ఉద్యోగి తన వాసన కోల్పోయాడు.దీనితో అనుమానం కలిగి కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ఆ ఉద్యోగి గత నెల 18న కరోనా పరీక్షలు చేయించుకోగా ఈ నెల 18 వ తేదీన మరల రెండవ డోస్ తీసుకున్నారు.అయినా కూడా కరోనా సోకడంతో విస్మయానికి గురయ్యారు.