తితిదే ఆస్తుల భద్రతపై హై కోర్ట్ లో ఒక పిటిషన్ దాఖలు అయింది. ఆ పిటిషన్ ప్రకారం తితిదే ఆస్తులను కాపాడాలి. న్యాయవాది యలమంజుల బాలాజీ హైకోర్టులో వేసిన ఈ పిటిషన్​పై నేడు విచారణ జరిగింది. తితిదేకు చెందిన స్థిర, చర ఆస్తుల జాబితాను పబ్లిక్ డొమైన్​లో ఉంచాలని యలమంజుల బాలాజీ ధర్మాసనాన్ని కోరారు. ఆస్తులను అమ్మేందుకు తితిదేకు కూడా అధికారం లేదని న్యాయస్థానం దృష్టికి తీసుకురాగా, ఆస్తుల వివరాలను అన్ని ఇప్పటికే పబ్లిక్ డొమైన్​లో పెట్టినట్లు తితిదే తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు.

ఆస్తుల పరిరక్షణ ముఖ్య ఉద్దేశ్యంగా హైకోర్టు మాజీన్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ కమిటీ నియమించినట్లు వివరించారు. తితిదేకు చెందిన ఆస్తుల వివరాలు, పబ్లిక్ డొమైన్​లో పెట్టిన ఆస్తుల వివరాలు, ఆస్తుల పరిరక్షణకు నియమించిన కమిటీ వివరాలను అఫిడవిట్ రూపంలో దాఖలు చేయాలని తితిదేను న్యాయస్థానం ఆదేశించింది. తదుపరి విచారణ 5 రోజుల తర్వాత జరగనుంది.