తమిళనాడులోని శివకాశి బాణసంచా పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన ఘటనలో ఆరుగురు దుర్మరణం చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసుల నుండి సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఒక ఆసుపత్రికి తరలించారు. విరుదు నగర్‌ జిల్లా కాళైయర్‌కురిచ్చిలోని ఓ బాణసంచా పరిశ్రమలో ప్రమాదవశాత్తూ భారీ పేలుడు సంభవించింది. శివకాశి పరిసర ప్రాంతాల్లో రెండు వారాల్లో ఇది మూడో సంఘటన కావడం దురదృష్టకరం.