అభిబస్ అనే ఆన్లైన్ ఇ-టిక్కెటింగ్ సేవల సంస్థ అని అందరికి తెలుసు! ఇప్పుడు అభిబిస్ ఐఆర్సీటీసీ (ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజమ్ కార్పొరేషన్) తో ఒప్పందానికి వచ్చింది.ఆ ఒప్పందం ప్రకారం బస్సు టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం ఐఆర్సీటీసీ వినియోగదార్లకు కూడా అందిస్తుంది. దాదాపు లక్ష బస్సు రూట్లలో ఏసీ, నాన్-ఏసీ బస్సు టిక్కెట్లు బుక్ చేసుకునే అవకాశం వచ్చింది. ఎక్కువ మంది వినియోగదారులకు తమ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలోనే ఈ భాగస్వామ్యానికి అంగీకరించినట్టు అభిబస్ ముఖ్య వాణిజ్య అధికారి శశాంక కోనా వివరించారు.అంటే కాకుండా ఐఆర్సీటీసీలో రైలు టికెట్ వెయిటింగ్ లిస్ట్ ఉంటే ప్రత్యామ్నాయంగా అదే మార్గంలో అందుబాటులో ఉన్న బస్సు సర్వీసులను అతి సులభంగా బుక్ చేస్కోవచ్చు. ఈ సర్వీస్‌ను ఉపయోగించుకోవలసిందిగా అభి బస్ కోరుతుంది.