అంతర్జాతీయం (International)

300 మంది విద్యార్థినుల కిడ్నాప్

నైజీరియా వాయువ్య భాగంలో ఉన్న జంఫారా రాష్ట్రంలో శుక్రవారంనాడు ఉదయం సాయుధులు దాడి చేసిన క్షణం నుండి మూడు వందల మంది స్కూలు విద్యార్థినులు అపహరణకు గురయ్యారని స్కూల్లో పని చేసే టీచర్ ఒకరు చెప్పారు. ఈ దాడిని గూర్చి ప్రభుత్వ వర్గాలు నిర్ధారించినప్పటికీ దీని గురించి పూర్తి వివరాలు మాత్రం బయటకు వెల్లడించలేదు.

పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసేందుకు ఆయుధాలతో తిరిగే ముఠాల సభ్యులు స్కూలు పిల్లలను బంధించడం ఇక్కడ తరచుగా జరిగేదే కానీ ఇటీవల కాలంలో స్కూళ్లను లక్ష్యంగా చేసుకుని ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులను అపహరించడం జరగలేదు.

గత వారం నైజర్ సెంట్రల్ స్టేట్‌లో అపహరణకు గురైన 42 మందిని ఇంకా విడుదల చేయకుండానే (అందులో 27 మంది విద్యార్థులు ఉన్నారు) ఇది జరగడం దురదృష్టకరం.

గత డిసెంబరులో దుండగులు 300 మందికి పైగా అబ్బాయిలను అపహరించి చర్చల తర్వాత వారిని వదిలిపెట్టేసారు.

ఇక ప్రస్తుతానికి వస్తే జంగబీలో ఉన్న ప్రభుత్వ బాలికల సెకండరీ స్కూలు దగ్గరకు శుక్రవారం ఆయుధాలు ధరించిన దుండగులు ప్రభుత్వ భద్రతాదళాలకు చెందినవారిలా దుస్తులు ధరించి వాహనాలు, మోటార్ సైకిళ్లతో వచ్చి దాడి చేసి విద్యార్థులను బలవంతంగా వాహనాలలోకి ఎక్కించి తీసుకుని వెళ్లినట్లుగా స్కూలు టీచర్ వివరించారు.

విద్యార్ధుల పట్ల తల్లిదండ్రులు తమ పిల్లలపై నిఘా ఉంచాలని చెడు అలవాట్లకు పాల్పడకుండ జాగ్రత్త వహించాలని, ఏదైన చెడు వస్తువులు కొనుగోలు చేసి తమ పిల్లలు సేవిస్తున్నారని అనుమానముంటె తమకు తెలియచేయాలని, వీలైనంతవరకు సహాయానికి అందుబాటులొ ఉంటామని పొలిసులు తెలిపారు.

విద్యార్థుల అపహరణ సమాచారం తెలిసినవెంటనే తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు వచ్చి స్కూలు చుట్టుపక్కల ఉన్న పొదల్లో తమ పిల్లల కోసం వెతుకుతున్నారని అక్కడి టీచర్ తెలిపారు. దాడి జరిగిన సమయంలో మొత్తం 421 మంది విద్యార్థులు ఉండగా కేవలం 55 మంది మాత్రమే స్కూలులో మిగిలారు. మిగిలిన వారంతా అపహరణకు గురయ్యారని టీచర్ చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.