తెలంగాణాలో మళ్ళీ కేసులు పెరగడంతో ప్రభుత్వం అలెర్ట్ అయి విద్యార్థుల క్షేమం మీద దృష్టి పెట్టింది.మహారాష్ట్రలో ఒకే స్కూల్ కి చెందిన 229 మంది హాస్టల్ విద్యార్థులకు కరోనా సోకడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రైవేట్ స్కూల్స్ లో కొత్త రూల్ తెచ్చింది. అది ఏంటంటే …..పాఠశాలల్లో బెంచ్ కి ఒక్క విద్యార్థి మాత్రమే ఉండాలని , మరియు ప్రతి ఇద్దరు విద్యార్థులు మధ్య కనీసం ఆరు అడుగుల భౌతిక దూరం పాటించాలిసిందే అని నిబంధన తెచ్చింది.ఈ నిబంధనలన్నీ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలన్నీ అమలు పరచవలసిందే అని పాఠశాల విద్య డైరెక్టర్‌ దేవసేన స్పష్టం చేశారు. వాటిని అమలు చేయకుండా ఏ స్కూల్ అయినా పట్టుబడిన పక్షం లో అంటువ్యాధుల నియంత్రణ చట్టం ప్రకారం చర్యలు చేపడతామని హెచ్చరించారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించిన నేపథ్యంలో నిబంధనల అమలు విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. మరో మూడు, నాలుగు రోజుల్లో స్కూళ్లలో తనిఖీలు చేయనున్నట్లు దేవసేన వెల్లడించారు.

మరోవైపు జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలు కూడా పాఠశాలల నిర్వహణను పర్యవేక్షిస్తాయి కాబట్టి ప్రతి పాఠశాల నిబంధనలను పాటించాల్సిందేనని, తరగతి గదులు సరిపోకపోతే, విద్యార్థులు ఎక్కువగా ఉంటే షిఫ్ట్‌ విధానంలో తరగతులు నిర్వహించుకోవచ్చని జిల్లా కమిటీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.