నెల్లూరు నగరంలో కొత్తూరుకు చెందిన దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉండగా, పెద్ద కుమార్తెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో ఆస్పత్రిలో ఉంచి వైద్యం చేయిస్తున్నారు. ఏ రోజుకారోజు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం వారిది.దీనితో చికిత్స చేయించడానికి డబ్బులు లేక ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో వారి ఇంటికి సమీపంలోనే ఉండే మానికల చిన్నసుబ్బయ్య (46 ) వీరి ఇబ్బందులన్నీ గమనించారు.

చిన్నసుబ్బయ్యకు భార్య లేకపోవడంతో అతడు వీరి రెండవ కుమార్తెను పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీనితో వారి ఇంటికి వెళ్లి రూ. 10 వేలకు ఆ బాలికను కొనుక్కుని, రెండు రోజుల క్రితం ఆ బాలికను పెళ్లి చేసుకున్న అతను బుధవారం రాత్రి విడవలూరు మండలం దంవూరులోని తన బంధువుల ఇంటికి తీసుకువచ్చాడు. అదే రోజు రాత్రి సమయంలో బాలిక పెద్దగా ఏడవడంతో స్థానికులు ఆరా తీయగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.వెంటనే ఈ విషయాన్నీ అక్కడివారు సర్పంచ్ దృష్టికి తీసుకువెళ్లి, బాలికను వేరొకరి ఇంట్లో పెట్టారు.గురువారం సచివాలయ సిబ్బంది సమాచారం ఇవ్వగా
ఐసీడీఎస్‌ అధికారులు దంపూరు వచ్చి బాలికను కలిసి ఆమెను నెల్లూరు లోని శిశుసంరక్షణ కేంద్రానికి తరలించారు.


విషయం తెలిసిన వెంటనే అందరు తల్లితండ్రులను కోప్పడ్డారు కానీ తరువాత వారి పరిస్థితికి జాలి పడుతున్నారు.పేదరికం ఎంత పని చేయించిందని కంటతడి పెడుతున్నారు. అధికారులు స్పందించి అమ్మ నాన్నలకు ఆర్ధిక సహాయం చేయాలని కోరుతున్నారు.