పెనుమాక గ్రామంలో విద్యుత్ శాఖ లైన్ మెన్ గా పని చేస్తున్న కూరగంటి వెంకటరావును సస్పెండ్ చేసారు. విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఈయనపై ఆరోపణలు వెల్లువెత్తడంతో అమరావతి డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ప్రత్తిపాటి విజయ్ కుమార్ లైన్ మెన్ వెంకట్ రావు నీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.