దేశవ్యాప్తంగా డీజిల్, పెట్రోల్ ధరలు భగ్గుమంటున్నాయి. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో చమురు ధరలు రూ.100కు చేరుకున్నాయి. ఈ కారణంగా వినియోగదారులు వాహనాలు తీయాలంటేనే భయపడుతున్నారు. ఎప్పటికప్పుడు ధరలు తగ్గుతాయని ఆశగా ఎదురు చూస్తున్న ప్రజలకు రోజు రోజుకు పెరుగుతున్న చమురు ధరలను చూసి తగ్గింపు విషయంలో ప్రభుత్వాలు ఏమైనా ప్రకటన చేయకపోతాయా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. దీనిపై మన నేతలు కూడా పొంతన లేని సమాధానాలు చెప్తున్నారు.

ఇలాంటి నేపథ్యంలో మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శీతాకాలం పోతే పెట్రోల్‌ ధరలు దిగివస్తాయని పేర్కొన్నారు. ఇది అంతర్జాతీయ వ్యవహారం. డిమాండ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు ధరలు ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా శీతాకాలంలో డిమాండ్‌ అధికంగా ఉంటుంది. ఈ సీజన్‌ పూర్తయితే ధరలు తగ్గుతాయి’’ అని మంత్రి వివరించారు. పెరిగిన పెట్రోల్, డీజిల్‌ ధరలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పేర్కొన్నారు. మరోవైపు పెరిగిన ధరలపై విపక్షాలు విమర్శనాస్త్రాలు విసురుతున్నారు.