క్రైమ్ (Crime)

జూబ్లీహిల్స్ పోలీసులపై యువకుడి దౌర్జన్యం

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఓ యువకుడు హద్దు మీరు ప్రవర్తించాడు. అందరి దృష్టిని ఆకర్షించాలని ఉద్దేశంతో సైలెన్సర్ తీసేసి మితిమీరిన శబ్దంతో నడుపుతూ, చెవికి చిల్లులు పడే శబ్దంతో వీరంగం సృష్టించాడు. ఆ యువకుడిని ట్రాఫిక్ పోలీసులు నిలదీయగా ఆ యువకుడి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పోలీసులపైనే ఎదురుదాడికి దిగాడు. ట్రాఫిక్ సీఐతో పాటు సిబ్బందిపైనా దాడికి చేసాడు. హోంగార్డుపై పిడిగుద్దులు కురిపించాడు.

అసలు జరిగిందేమిటంటే.. ఒక యువకుడు బైక్‌ సైలెన్సర్ తీసేసి హెవీ సౌండ్‌తో రోడ్డుపై చక్కర్లు కొట్టడంతో అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్‌ సీఐ ఆ బైక్‌ను ఆపాల్సిందిగా హోంగార్డు రాథోడ్‌కు సూచించారు. ఆయన వాహనాన్ని నిలిపేందుకు ప్రయత్నించగా ఆ యువకుడు రెచ్చిపోయాడు. ఏకంగా హోంగార్డుపై దాడి చేశాడు.

హోంగార్డుపై దాడి చేస్తుండగా నిలదీసేందుకు సీఐ వెళ్లగా ఆయన్ని కూడా ఈ యువకుడు పక్కకి నెట్టేసి దాడికి పాల్పడ్డాడు. పోలీసు సిబ్బందితో పాటు ఇతర వాహనదారులు ఎంత చెప్పినా అతడు వినిపించుకోకుండా స్నేహితులతో కలిసి నానా హంగామా సృష్టించాడు. దీంతో ట్రాఫిక్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించి, యువకుడితో పాటు అతడి స్నేహితులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.