ఏపీలోని కర్నూలు మండలం పంచలింగాల సరిహద్దు చెక్‌పోస్టు వద్ద గురువారం తెలంగాణ వైపు నుంచి కర్నూలు వస్తున్న ఆర్టీసీ బస్సును ఆపి స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో అధికారుల తనిఖీ చేయగా రాజు అనే ప్రయాణికుడి సంచీలో బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. విచారించగా తాను అనంతపురం జిల్లా తాడిపత్రిలోని రాయలసీమ బులియన్‌ కమ్‌ ట్రేడ్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే నగల దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తానని, తన యజమాని రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు హైదరాబాదులోని ఒక బంగారు దుకాణం నుంచి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఆధారాలు సరిగా లేకపోవడంతో బంగారాన్ని సీజ్‌ చేసి కర్నూలు అర్బన్‌ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.