దేశం 60వేలకు చేరువగా కొత్త కేసులు, 200కుపైగా మరణాలతో కలవరపడుతోంది. గడిచిన 24 గంటల్లో 11,00,756 కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 59,118 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. మొత్తం కేసులు కోటి 18లక్షల మార్కును దాటగా.. మృతుల సంఖ్య 1,60,949కి చేరింది. ప్రస్తుతం 4,21,066 క్రియాశీల కేసులుంటే ఆ రేటు 3.55 శాతానికి చేరింది. ఇప్పటివరకు 1,12,64,637 మంది కొవిడ్ నుంచి కోలుకోగా..ఆ రేటు 95.09శాతానికి పడిపోయింది. నిన్న ఒక్కరోజే 32,987 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.